ముదురుతున్న మొండికత్తి వివాదం..!

-

త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా దసరా కానుకగా లాస్ట్ వీక్ రిలీజైన సినిమా అరవింద సమేత. మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలక్షన్స్ కూడా అదరగొడుతున్నాయి. అంతా సూపర్ అనుకుంటున్న టైంలో అరవింద సమేత మీద ఆ సినిమా దర్శకుడు త్రివిక్రం మీద తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు ప్రముఖ రచయిత గంగాధర్.

కేంద్రీయ పురస్కార గ్రహీత వేంపల్లి గంగాధర్ రాసిన పాపాఘ్ని కథల్లో మొండికత్తి కుంటి గుర్రం కాన్సెప్ట్ తో కథ రాశాడు. అరవింద సమేత సినిమా టైంలో గంగాధర్ తో చర్చలు జరిపి ఆయన రాసిన కథలను తెలుసుకున్నాడట త్రివిక్రం. అయితే తనకు చెప్పకుండా సినిమాలో మొండికత్తిని వాడారని అంటున్నాడు గంగాధర్. నాలుగు రోజుల క్రితం ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన గంగాధర్ ఆ వెంటనే అది డిలీట్ చేశాడు.

అయితే లేటెస్ట్ గా ఓ టివి ఇంటర్వ్యూ లో త్రివిక్రం మీద ఫైర్ అయ్యాడు గంగాధర్. త్రివిక్రం ది రచయితలను తొక్కేసే నేచర్ అని.. నాలాంటి పదిమంది రాసిన కథలతో సినిమా తీశారని అన్నాడు గంగాధర్. అంతేకాదు సీమ ఫ్యాక్షన్ మీద చేసిన పరిశోధలతో అదే నేపథ్యాన్ని తీసుకుని హీరోయిన్ పూజా హెగ్దె పాత్ర డిజైన్ చేశారని చెప్పుకొచ్చాడు. మరి గంగాధర్ చేస్తున్న వ్యాఖ్యలకు త్రివిక్రం దగ్గర నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version