Dubbing’ writer Sree Ramakrishna is no more: చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.
అనువాద మాటల రచయిత శ్రీ రామకృష్ణ(74) కన్నుమూత. అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణ ఆరోగ్య క్షీణించటంతో సోమవారం రాత్రి 8 గంటలకు తేనాపేటలోని అపోలో హాస్పిటల్ లో కన్నుమూశారు. శ్రీరామకృష్ణ స్వస్తలం తెనాలి కాగా 50 ఏళ్ల కిందట చెన్నైలో స్థిరపడ్డారు.
ఆయనకు బార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. ముంబై, జెంటిల్మన్, చంద్రముఖి తదితర 300 చిత్రాలకు పైగా అనువాద రచయితగా పనిచేసిన శ్రీ రామకృష్ణ బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకులు మణిరత్నం, శంకర్ అన్ని చిత్రాలకు మాటలు రాసిన శ్రీరామకృష్ణ, రజనీకాంత్ దర్బార్ చిత్రానికి చివరిగా మాటలు అందించారు. ఆయన పార్థివ దేహానికి రేపు ఉదయం సాలిగ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు గౌతం తెలిపారు.