బరువెక్కిన గుండెతో కష్టాలు చెప్పుకుంటూ ఎమోషనల్ అయిన ఝాన్సీ..!!

-

ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు. ఎంతోమందికి లైఫ్ ను ఇవ్వడమే కాకుండా మరింత మందిని స్టార్ సెలబ్రిటీలు గా మార్చుతోంది. ఇక అలాంటి కామెడీ షోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న డాన్సర్ ఝాన్సీ కూడా ఒకరు. ఇకపోతే ఈమె ముందుగా కండక్టర్గా బస్సులో పనిచేసేది.. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ కంటే ముందే ఎన్నో చానల్స్ లో పనిచేసింది. జీ తెలుగులో తీన్మార్ , జెమినీ టీవీలో డాన్సింగ్ స్టార్ విన్నర్ గా , మాటీవీలో రంగం 2 లో కూడా చేసింది. అయితే ఇటీవల తన కష్టాలు చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది.డాన్సర్ ఝాన్సీ మాట్లాడుతూ.. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం..మొదటి నుంచే ఇంట్లో సపోర్టు లభించలేదు. కానీ అదే ఇప్పుడు నాకు అన్నం పెడుతోంది .ఇక నేను ఈరోజు స్టేజ్ డాన్సర్ నుంచి పెద్దపెద్ద వేదికలపై డాన్స్ చేస్తున్నానంటే కారణం మా గురువుగారు రమేష్. గాజువాక డిపో కండక్టర్గా 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను.. ఇక అప్పటినుంచి నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. కానీ అప్పట్లో సోషల్ మీడియా లేదు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నాకు ఇంత పేరు వచ్చింది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లో డాన్స్ చేయడం వల్ల మరింత పేరు వచ్చింది అంటూ ఆమె తెలిపింది. వివాహం జరిగిన తర్వాత మా ఆయన చాలా సపోర్ట్ చేసారు. ఒకవైపు ఉద్యోగం, మరొక వైపు డాన్స్ చేస్తున్నాను అంటే మా డిపో వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహమే .. ముఖ్యంగా నాకు ప్రోగ్రామ్ ఉందంటే షిఫ్ట్ కూడా మార్చేవారు.

డాన్స్ అంటే చాలామందికి చిన్న చూపు ఉంటుంది. బరితెగించేసి స్టేజ్ ఎక్కుతార్రా అని అనుకుంటారు. తండ్రి లేరు నాతో పాటు డాన్స్ చేస్తున్న నా వెనుక ఉండే అమ్మాయిలకు కూడా తండ్రులు లేరు. తండ్రి లేకపోతే పోషించాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. దొంగతనం చేయలేదు అలాగని లం**తనం చేయలేదు.. డాన్స్ చేసి మా తమ్ముడిని నేడు హెచ్ ఆర్ మేనేజర్ గా చేశాను. ఎన్నో కష్టాలను అనుభవించాను.. చివరికి కట్టుకున్న వాడు అత్త వారు సపోర్టుగా నిలవడం వల్ల ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ తన బాధను వెల్లడించింది.

<iframe width=”683″ height=”384″ src=”https://www.youtube.com/embed/P8dIGdzTFP0″ title=”Kappala Pelli | Sridevi Drama Company Latest Promo | 28th August 2022 | Rashmi,Aamani,Aadi,Ramprasad” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

Read more RELATED
Recommended to you

Exit mobile version