SLBC టన్నెల్ ప్రమాదంపై తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్ లో చిక్కుకున్న ప్రాజెక్టు మేనేజర్ ఫోన్ రింగ్ అవుతోందని.. ఆయన తాజాగా మీడియాతో వెల్లడించారు. ఈ ఘటన జరిగిన రోజు ఆయన తన భార్యకు ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లు… తమకు తెలిసినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించడం జరిగింది.
దీంతో మేము ఆయనకు ఫోన్ చేయగా మొదట రింగ్ అయి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీ సహాయంతో ఫోన్ ట్రేస్ చేస్తున్నామని… వివరించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది ఇలా ఉండగా మొదట తన్నెల్ కూలినప్పుడు.. మట్టి అలాగే నీళ్లు 13.5 కిలోమీటర్ల వద్ద ఉండే…. కానీ ఇప్పుడు మట్టి అలాగే నీళ్లు 11 కిలోమీటర్ల వరకు చేరిందని.. అధికారులు చెబుతున్నారు.