సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ రొమాంటిక్ సెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లతో లిప్ లాక్ అంటే హష్మీ గుర్తు రావాల్సిందే. రొమాంటిక్ సన్నివేశాల్లో వాస్తవికంగా నటించాలంటే? అక్కడ దర్శక, నిర్మాతలు హష్మీ కోసమే వెయిట్ చేయాలి. మరో హీరో వాటిలో నటించినా ఫీల్ రాదు. అందుకే హష్మీ అంత ఫేమస్ అయ్యాడు. అయితే సినిమాల్లోనే కాదు…రియల్ గాను పిచ్చ రొమాంటిక్ ఫెలో అని స్వయంగా తానే ఓ ఇంటర్వూలో వెల్లడించాడు. అదీ మామూలు రొమన్స్ కాదండి. ఏకంగా పెళ్లైన మహిళతోనే ఏకంగా అక్రమం సంబంధం కొనసాగించానని షాకింగ్ విషయం చెప్పాడు. 2004లో చేసిన మర్డర్ సినిమా కథే తన రియల్ లైఫ్ లో జరిగిందిట.
ఓ మహిళతో అనుకోకుండా పరిచయం ఏర్పడిందిట. ఇద్దరు ఒకరికి ఒకరు నచ్చడంతో శారీరకంగా కలిసారుట. కానీ ఆమెకు పెళ్లి అయిందన్న విషయం తెలియదట. వదిలేద్దామని నిర్ణయించకున్నాడుట. కానీ అందుకు ఆ మహిళ ఒప్పుకోలేదుట. దీంతో మనసు చంపుకుని ఆమెతో సుఖం పంచుకోవాల్సి వచ్చిందిట. అలా కలిసినప్పుడల్లా మానసికంగా ఎంతో వేదన అనుభవించానని..తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్ కలిగినా..ఆ మహిళ వదలకపోవడంతో తప్పలేదన్నాడు. అదే తన ఫ్యామిలీలో తన భార్య తో ఎవరైనా అక్రమ సంబధం నెరిపితే నరికి చంపేసేవాడినని అన్నాడు. ఇలాంటి బంధాలు ఎక్కువ కాలం ఉండవని..ఏదో ఒక రోజు దొంగ దొరకకపోడని తెలిపాడు. ఓ రోజు ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా ఆ మహిళ భర్తకు దొరికిపోయారుట.
పెద్ద గొడవ అయిందిట. తర్వాత పెద్దలు కల్పించుకుని సమస్యకు పరిష్కారం చూపించారని తెలిపాడు. ఇలాంటి ఘటనలను పేపర్లో చదివినప్పుడు ఎంతో బాధ కల్గుతుందిన్నాడు. సుఖం కోసం మహిళ మరో మగవాడిని కోరుకోవడం అన్నది పెద్ద తప్పు. ఆ మహిళ విషయంలో ఆమె తప్పు ఎంత ఉందో? అంతకు మించిన పెద్ద తప్పు పురుషుడిది ఉందని! అన్నాడు. తప్పు ను నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు..ఆ తప్పును మీడియా ముఖంగా చెప్పడంలో తప్పేం లేదని భావించి ఈ సీక్రెట్ చెప్పినట్లు వెల్లడించాడు.