మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఇవాళ జరగనుంది. హైదరాబాదులో ఇరు కుటుంబాల సమక్షంలో ఈ వేడుక జరగనుందని వరుణ్ సన్నిహితులు తెలిపారు. త్వరలో పెళ్లి తేదిని కూడా ప్రకటించనున్నారట. ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.
కేవలం వెడ్డింగ్ కార్డు కోసమే వీరు 80 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. వెడ్డింగ్ కార్డుని బంగారు పూతతో కోటింగ్ చేయిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే అంత డబ్బు కేవలం ఒక వెడ్డింగ్ కార్డు కోసమే వీరు ఖర్చు చేస్తున్నారు అంటే ఇక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.