తినే ముందు కంచం చుట్టూ నీళ్లు ఎందుకు చల్లాలి..?

-

పూర్వం పాటించే పద్ధతుల్ని ఈరోజుల్లో కూడా చాలామంది పాటిస్తున్నారు. పూర్వం తాత తండ్రి చేసినవి ఈ రోజుల్లో కూడా చాలామంది అనుసరిస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెబుతారు. అన్నం తినే ముందు శ్లోకాన్ని కూడా చాలా మంది చదువుతూ ఉంటారు స్కూల్ పిల్లల నుండి పెద్దల వరకు చాలా మంది అన్నం తినే ముందు శ్లోకాన్ని చదువుతూ ఉంటారు అయితే అన్నం తినే ముందు ఒక ముద్ద తీసి కంచం పక్కన కూడా పెడుతూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన అన్నం విలువ తెలుస్తుంది అని పిల్లలకి చెప్తూ ఉంటారు.

పెద్దలైతే అన్నాన్ని తినే ముందు కంచం చుట్టూ నీళ్లు జల్లుతూ ఉంటారు ఎందుకు ఇలా నీళ్లు చల్లాలి దాని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం… ఏదైనా శుభకార్యానికి వెళ్లినా లేకపోతే అందరితో కలిసి కూర్చున్నా కంచం లేదా అరిటాకు చుట్టు నీళ్లు చల్లుతారు ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం ఇది మతపరమైన ఆచారమే కాదు దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది ఇదివరకు అందరూ అరిటాకులోనే భోజనం చేసేవారు కానీ ఈరోజు ఎక్కువమంది ప్లేట్స్ లోనే తింటున్నారు.

ఎందులో తిన్నా కూడా పాత్ర చుట్టూ నీళ్లు జల్లడం చాలామంది మారలేదు అయితే నీటిని చల్లడం వలన మట్టిని ఎగురాకుండా చెయ్యచ్చు. తినే టైంలో గాలి వీచినా కూడా మట్టి రేణువులు ఎగిరి అన్నంలో పడవు. ఇదివరకు అందరూ నేల మీద కూర్చునేవారు అప్పట్లో మట్టి నేలలు ఉండేవి మట్టి అన్నంలో పడకూడదని నీళ్లు చల్లేవారు ఇది అప్పటినుండి కొనసాగుతున్న పద్ధతి. ఇప్పుడు కాలంతో పాటుగా కట్టుబాట్లు కూడా మారిపోయాయి ఈ రోజుల్లో అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు పైగా మట్టి నేలలు కూడా ఇప్పుడు లేవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version