టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నే కాదు మొత్తం సినీ ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని కొంతమంది బయట పెడితే మరికొంతమంది చేస్తే తప్పేముంది అంటూ కూడా చెప్పుకురావడం ఆశ్చర్యకరమని చెప్పాలి.. ఈ క్రమంలోనే డబ్బు కావాలి.. సినిమా అవకాశాలు రావాలి అంటే పక్కలోకి వెళ్లాల్సిందే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రముఖ నటి కల్పిక గణేష్.. ఈమె పేరు ఎవరికి పెద్దగా తెలియక పోయినప్పటికీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంతకు అక్క పాత్రలో నటించిన నటి అంటే మాత్రం అందరికీ వెంటనే గుర్తుకు వస్తుంది.
గత కొన్ని రోజులుగా కమెడియన్ అభినవ్ తో తో పెద్ద ఎత్తున గొడవ పడుతూ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఒక కార్యక్రమంలో భాగంగా బెస్ట్ సపోర్టింగ్ పాత్రలో నటించినందుకు గాను అవార్డు అందుకోవడంతో అభినవ్ వెంగ్యంగ కామెంట్లు చేశారు.. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో డిబేట్ మొదలైంది. అభినవ్ మహిళలను కించపరుస్తూ మాట్లాడాడు అని, తాను క్షమాపణలు చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేసింది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్పిక క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఈ సందర్భంగా కల్పిక మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నమాట వాస్తవమే.. అయితే ఇలాంటి ఇబ్బందులను ప్రతి ఒక్కరు ఎదుర్కోరని, అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం అంటూ కామెంట్ చేసింది.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురైనప్పుడు కొందరు ఎన్నో ఇబ్బందులు పడుతూ. పూర్తిగా ఈ విషయాన్ని ఖండిస్తారు.. మరి కొంతమంది మాత్రం ఇష్టపూర్వకంగానే కమిట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇష్టంతో కమిట్మెంట్ ఇచ్చే వారి విషయంలో క్యాస్టింగ్ కౌచ్ తప్పుగా అనిపించదని, బలవంతంగా కమిట్మెంట్ అడగడం పూర్తిగా తప్పు అంటూ కూడా ఆమె కామెంట్ చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత.. త్వరగా డబ్బు సంపాదించాలి లేదా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాలి అని ఆలోచించే చాలామంది ఇలాంటి కమిట్మెంట్లకు లొంగుతుంటారు అంటూ ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.