గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ఘటన.. 132కు చేరిన మృతుల సంఖ్య

-

గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. ఈ ఘటనపై హైపవర్ కమిటీని ఆదివారమే నియమించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు, సహాయక సిబ్బంది 177 మందిని సురక్షితంగా కాపాడినట్లు ఆ రాష్ట్ర సమాచార శాఖ పేర్కొంది. 19 మందికి గాయాలు కాగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్, ఎన్​డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో భాగమయ్యాయని తెలిపింది.

మోర్బీ నగరంలోని మచ్చు నదిపై బ్రిటిష్ కాలం నాటి ఓ తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జిపై ఉన్న కొంతమంది యువకులు ఉద్దేశపూర్వకంగా వంతెనను ఊపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. వంతెన కూలడం వల్ల చాలామంది నీటిలో పడి గల్లంతయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు అధికంగా ఉండగా… వందల మంది గాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version