లావణ్య తో పెళ్లి వద్దు అంటూ వరుణ్ తేజ్ కి సలహా ఇస్తున్న ఫ్యాన్స్.. ఏమైందంటే..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇదిలా ఉండగా ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడగగా..తాము స్నేహితులము మాత్రమేనని అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఏడాది జూన్ 9వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక దీంతో వీరి పెళ్లి ఆగస్టులో ఉంటుందని అందరూ అనుకున్నప్పటికీ.. మెగా కాంపౌండ్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. నవంబర్ నెలలో ఇటలీలో చాలా గ్రాండ్ గా వీళ్ళ పెళ్లి జరగబోతుందని సమాచారం.

ఇకపోతే పెళ్లికి ఇంకా కొద్దిరోజులే ఉన్న సమయంలో లావణ్య త్రిపాఠి తో వరుణ్ తేజ్ ని పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలి అంటూ అభిమానులు కోరుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గాండీవ దారి అర్జున సినిమా భారీగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. అలాగే వరుణ్ తేజ్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఇదే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క భోళా శంకర్ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో లావణ్య మీ ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టడం వల్లే మీకు ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇక ఆమె ఇండస్ట్రీకి వచ్చే ముందు ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. అలాంటప్పుడు ఇప్పుడు మీ ఇంట్లోకి ఆమె కోడలుగా వస్తే మీ పనులు జరుగుతాయా లేదా అన్నది ఒకసారి ఆలోచించండి. దయచేసి ఆమెతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి అంటూ కావాలని కొంతమంది నెగటివ్గా వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version