స్టైలిష్ లుక్ లో కుర్రకారును ఫిదా చేస్తున్న ఫరియా అబ్దుల్లా..!

-

జాతి రత్నాలు సినిమాతో చిట్టిగా మంచి పేరు దక్కించుకొని మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే యువ హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక తన గ్లామర్ తోనే కాకుండా కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంటూ యువతకు మరింత దగ్గరవుతుందని చెప్పాలి. పక్కా హైదరాబాదీ అమ్మాయి అయిన ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే ప్రభాస్ లాంటి అగ్రస్టార్ హీరో ప్రశంసలు అందుకుంది అంటే ఇక ఈమెకు తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ ఈమెకు మాత్రం అవకాశాలు రావడం లేదని చెప్పాలి.

ఇక జాతి రత్నాలు సినిమా తీసుకొచ్చిన క్రేజ్ మరే సినిమా తీసుకురాలేకపోతోంది.. ఎందుకంటే ఈమె కి తన హైటే శాపంగా మారుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభాస్ , మహేష్ బాబు లాంటి హీరోల పక్కన మినహా మరే హీరోల పక్కన ఈమె జత కట్టడానికి కుదరదు. ఎందుకంటే ఈమె పక్కన ఆ హీరోలంతా కూడా పొట్టిగానే కనిపిస్తారు బహుశా అందుకే ఈమెకు అవకాశాలు రావడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఐటెం సాంగ్ తోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలోనే కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన బంగార్రాజు సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందర్నీ ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా లైక్ షేర్ సబ్స్క్రయిబ్ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటుంది. తాజాగా వల్లి మెయిల్ అనే సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాపులారిటీ దక్కించుకోవడానికి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ లుక్స్ షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన హాట్ ఫోటోలు యువతను మరింతగా ఆకట్టుకుంటున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

Read more RELATED
Recommended to you

Latest news