టీడీపీకి అశోక్ గజపతి రాజు రాజీనామా చేశారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలానే పార్టీ పొలిట్ బ్యూరో పదవికి కూడా ఆయన రిజైన్ చేశారు. ఇటీవలే ఆయన్ను గోవా గవర్నర్ గా కేంద్రం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈయన గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పని చేశారు. అటు గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు అవకాశం ఇవ్వగా.. హరియాణా గవర్నర్‌గా ఆషిమ్ కుమార్ ఘోష్‌ను, లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు మీదుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.