మెగా అభిమానులకు పండగ.. గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రిలీజ్

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “గాడ్ ఫస్ట్”. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా ‘లూసిఫర్ ‘ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా సినిమా యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. జూలై 4 న సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఈ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో జరగబోతున్న ఈ సినిమాలో సల్మాన్ మాఫియా డాన్ గా నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాలో చిన్న పాత్ర చేసినట్లు సమాచారం. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా.. చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ దసరా పండుగకు గాడ్ ఫాదర్ రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version