జూలై ఒకటి నుంచి బ్యాంక్ రూల్స్ మారిన సంగతి తెలిసిందే..కొన్ని ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్లుపెంచాయి..మరి కొన్ని బ్యాంకులు వడ్డీని తగ్గించాయి.ప్రస్తుతం ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులన్నీ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతుతున్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మీరు మునుపటి కంటే ఎక్కువ వడ్డీని పొందుతారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు..
7 నుండి 14 రోజుల FDలపై, 3 శాతం, సీనియర్ సిటిజన్లు 3.5 శాతం వడ్డీని పొందుతున్నారు. 15 నుండి 29 రోజుల FDలపై, సాధారణ డిపాజిటర్ 3 శాతం, సీనియర్ సిటిజన్లు 3.5 శాతం వడ్డీని పొందుతున్నారు. అదేవిధంగా 30 నుండి 45 రోజుల FDలపై వడ్డీ రేటు కూడా అదే విధంగా ఉంటుంది. 46 నుండి 90 రోజులకు సాధారణ కస్టమర్లకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం వడ్డీ లభిస్తుంది. 91 నుండి 179 రోజుల మెచ్యూరిటీ ఉన్న FDలపై 4 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 4.5 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది.
180 రోజుల నుండి 270 రోజుల FDలకు 4.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 5 శాతం, ఇక 271 నుండి 1 సంవత్సరం FDలకు 4.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 5 శాతం, 1 సంవత్సరం FDలకు 5.3 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.8 శాతం, 1 నుండి 2 సంవత్సరాల FDలకు 5.3 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.8 శాతం, 2 నుండి 3 సంవత్సరాల FDలపై సీనియర్ సిటిజన్లకు 5.5 శాతం నుంచి 6 శాతం వడ్డీ పెరిగింది..