రీల్ లైఫ్ లో ఫైట్ మాస్టర్స్ గా ఉన్నా రియల్ లైఫ్ లో ప్రజల మనసులు గెలిచేలా తమ వంతు కృషి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రాం లక్ష్మణ్. 1987లో అసిస్టెంట్స్ గా సిని కెరియర్ ప్రారంభించిన వీరు 1100 సినిమాల దాకా ఫైట్ కంపోజ్ చేయడం జరిగింది. స్టార్ సినిమా.. చిన్న సినిమా అనే తేడా లేకుండా ఈ ఇద్దరు తమ ఫైట్ కంపోజింగ్ తో అందరిని మెప్పిస్తారు.
కవలలైన రాం లక్ష్మణ్ ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఏ చిన్న రిమార్క్ కూడా తెచ్చుకోలేదు. అయితే వీరు ఇక సినిమా జర్నీని ఆపేసి సామాజిక సేవ చేయాలని నిర్ణయించుకున్నారట. సొంత ఊరు కారంచెడుని బాగు చేసి అక్కడ తమకు తోచిన సాయం చేస్తారని తెలుస్తుంది. పుట్టిన ఊరి బాగు కోసం కెరియర్ కూడా వదిలేసి వెళ్లాలని డిసైడ్ అయ్యారట.
అక్కడే ఇక మిగతా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారట. అంతేకాదు సేవా కార్యక్రమాలను నడిపించాలని అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసి ఫైట్ మాస్టర్స్ అయిన రాం లక్ష్మణ్ కు అందరు హ్యాట్సాఫ్ అంటున్నారు.