తెలంగాణలో ముందస్తు విచారకరం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే లేదని రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఏమైనా ఉందా? అన్న మీడియా ప్రశ్నకు లోకేష్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండాలని ప్రజల కోరిక అని… అయితే ఐదేళ్ల పాటు తెలంగాణలో ప్రభుత్వం నడవకపోవడం విచారకరమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు బాబ్లీ కోసం చంద్రబాబు పోరాడారని… ధర్మాబాద్ పోరాటంలో తెలుగుదేశం తెగువను అంతా చూశారని అన్నారు. చంద్రబాబును, టీడీపీ నేతలను అరెస్ట్ చేసినా… నాడు వెనక్కి తగ్గలేదన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసినందున చంద్రబాబు బెయిల్ కూడా నిరాకరించారని మంత్రి లోకేష్ గుర్తుచేశారు