నెట్‌ఫ్లిక్స్‌లో హృతిక్-దీపికల ‘ఫైటర్‌’ రికార్డు

-

బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్ రోషన్‌, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫైటర్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 21వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక మంది చూసిన మూడో సినిమాగా ‘ఫైటర్‌’ నిలిచింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ గతవారంలో విడుదలైన సినిమాల వ్యూస్‌ను వెల్లడించింది. ఓటీటీలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 59 లక్షల మంది చూశారు. ఈ సినిమా 16.2 మిలియన్ గంటల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇదీ స్టోరీ : సంషేర్ ప‌ఠానియా అలియాస్ పాటీ (హృతిక్ రోష‌న్‌) భార‌త వైమానిక ద‌ళంలో స్క్వాడ్ర‌న్ లీడ‌ర్‌. సాహ‌సాల‌కి వెనకాడ‌ని ఫైట‌ర్ పైల‌ట్‌. అప్ప‌జెప్పిన బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించే క్ర‌మంలో త‌న‌కున్న ప‌రిధుల్ని, నిబంధ‌న‌ల్ని దాటి మ‌రీ సాహ‌సాలు చేస్తుంటాడు. ఆ క్ర‌మంలోనే జ‌రిగిన ఓ దుస్సంఘ‌ట‌న‌కి బాధ్యుడిగా నింద‌ మోస్తూ ఉంటాడు. రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఓ ఆప‌రేష‌న్ కోసం శ్రీన‌గ‌ర్ వ‌స్తాడు. సీవో రాకీ (అనిల్ క‌పూర్‌) నేతృత్వంలో మిన్ను అలియాస్ మిన‌ల్ సింగ్ రాఠోడ్‌ (దీపికా ప‌దుకొణె), తాజ్ (క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌), బాష్ (అక్ష‌య్ ఒబెరాయ్‌) బృందం రంగంలోకి దిగుతుంది. గ‌గ‌న‌త‌లంలో శ‌త్రువుల‌పై వాళ్ల పోరాటం ఎలా సాగింది? పాటీ మ‌ళ్లీ నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించాడా? రెండేళ్ల కింద‌ట జ‌రిగిన ఆ సంఘ‌ట‌న ఏమిటి? త‌నకు ఎదురైన స‌వాళ్ల‌ని ఎలా దాటాడన్నదే స్టోరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version