సినీ కార్మికులు ఆందోళన ఉదృతం అవుతోంది. ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. వేతనాలు పెంచాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. 24 యూనియన్ల సినీ కార్మికులు.. ఆందోళనలో పాల్గొన్నారు. శనివారం నిర్మాతలు, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.

మూడు కేటగిరీలుగా విభజించి, కార్మికుల వేతనాల్ని పెంచాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు . అయితే.. నిర్మాతల నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన వ్యక్తం చేశారు.