అయ్యో పాపం… అల్లు అర్జున్ ను గుర్తుపట్టని సెక్యూరిటీ సిబ్బంది…!

-

పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతని గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. అలాంటి అల్లు అర్జున్ కు నిన్న ముంబై ఎయిర్పోర్టులో చేదు అనుభవం ఎదురయింది. ఎయిర్ పోర్టులో అతడు కళ్ళజోడు, మాస్క్ పెట్టుకొని వెళుతుండగా చెకింగ్ పాయింట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది బన్నీని ఆపేశారు.

Allu Arjun was  stopped by an officer and asked to show his face with Id
Allu Arjun was stopped by an officer and asked to show his face with Id

బన్నీ అసిస్టెంట్ ఆయన అల్లు అర్జున్ అని చెప్పినప్పటికీ తప్పకుండా ముఖం చూపించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అల్లు అర్జున్ కళ్ళజోడు, మాస్క్ తీసి మరీ చూపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా కొంతమంది ఫైర్ అవుతున్నారు. అంత పెద్ద హీరోని గుర్తు పట్టకపోవడం ఏంటి? కావాలనే సెక్యూరిటీ సిబ్బంది అల్లు అర్జున్ ను అవమానించారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా మరికొంతమంది అందులో తప్పేముంది తన పని తాను చేసుకుంటూ పోయాడని కొంతమంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news