టోల్ ప్లాజా వద్ద ఏనుగు హల్చల్ చేసింది. దీంతో వాహనదారులు ఒక్కసారిగా వణికిపోయారు. ఈ సంఘటన ఉత్తరాంఖడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాంఖడ్ రాష్ట్రం డెహ్రాడూన్ – హరిద్వార్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా ఉన్న సంగతి తెలిసిందే. లచ్చి వాలా టోలి ప్లాజా కాస్త అడవి ప్రాంతంలో ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ టోల్ ప్లాజా దగ్గరికి ఏనుగు వచ్చేసింది. ఏనుగు ప్రత్యక్షం కావడమే కాకుండా…. అక్కడ ఉన్న వాహనాలపై దాడి కూడా చేసింది. ఓ కారును తొండంతో కొట్టబోగా.. చాలా చాకచక్యంగా దాని నుంచి తప్పించుకున్నాడు డ్రైవర్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
టోల్ ప్లాజా వద్ద గజరాజు హల్చల్.. భయంతో వణికిపోయిన వాహనదారులు..
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్-హరిద్వార్ జాతీయ రహదారిపై ఘటన
లచ్చివాలా టోల్ ప్లాజా వద్ద క్యూ లైన్ లో ఉన్న వాహనాలపై ఏనుగు దాడి
చాకచక్యంగా ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న డ్రైవర్
సోషల్ మీడియాలో వీడియో వైరల్ pic.twitter.com/q9N0aK97gl
— BIG TV Breaking News (@bigtvtelugu) August 10, 2025