నటుడు ఫిష్ వెంకట్ కొద్ది రోజుల క్రితమే మరణించిన సంగతి తెలిసిందే. ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఫిష్ వెంకట్ బతికున్న సమయంలో ప్రతి ఒక్కరికి ఓ మెసేజ్ ఇచ్చారు. ఎవరు కూడా గుట్కాలు తినకూడదని వాటికి దూరంగా ఉండాలి అంటూ చెప్పాడు. నేను గతంలో రోజుకు 30 నుంచి 40 గుట్కాలు తినేవాడిని. పాన్ మసాలాలు వేసేవాడిని. దీనివల్ల నాకు మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు.

దానికి గల ప్రధాన కారణం గుట్కాలే. డాక్టర్ సూచనలతో వాటిని తినడం నెమ్మదిగా తగ్గించేశాను. అప్పుడు నా ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఆ తర్వాత మళ్లీ నేను అనారోగ్యం బారిన పడ్డాను అంటూ అన్నారు. ఎవరు కూడా గుట్కాలు తినకూడదు కుటుంబంతో సంతోషంగా ఉండాలి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ కి సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతుంది.