ఏపీలో జిల్లాల పేర్లు మార్పునకు సిద్ధమైన ప్రభుత్వం… ఈ మేరకు మార్పుపై ఏడుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది కూటమి సర్కార్. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధుల నుంచి కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటుపై విపరీతంగా డిమాండ్లు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి అనిత నారాయణ నిమ్మల రామానాయుడు నాదెండ్ల మనోహర్ సత్య కుమార్ యాదవ్ ఉన్నారు.