తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు నుంచి రేపు ఉదయం 8:30 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.

ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం అధికంగా కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచనలు జారీ చేశారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది.