జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. తాజాగా వరుణ్ నటించిన చిత్రం గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 25న బాక్సాఫీసు ముందుకొచ్చి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మూస ధోరణిలో ఉన్న మూవీ స్టోరీ వరుణ్ అభిమానులనూ ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఎలా వచ్చిందో అలాగే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది.
అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా ఈ నెల 24వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ పోస్టర్ విడుదల చేసింది. ‘సెప్టెంబరు 24న రానున్నది గాండీవధారి అర్జున సినిమానే కాదు ఓ ఏజెంట్ తెచ్చే ధైర్యం కూడా’ అని పేర్కొంది. యాక్షన్ ఎంటర్టైనర్గా లండన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ బాడీగార్డ్‌గా కనిపిస్తారు. ఆయన సరసన సాక్షి వైద్య నటించింది. నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.