కల్కీ సినిమాపై గరికపాటి సీరియస్..భారతం చదివితే తెలుస్తుందని సెటైర్

-

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్న అందుకున్న విషయం తెలిసిందే.పురాణాలను, భవిష్యత్‌ను అంచనా వేసి నాగఅశ్విన్‌ సృష్టించిన కొత్త ప్రపంచం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేస్తోంది.

తాజాగా ఈ సినిమాపై ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు ఫైర్ అయ్యారు. మహాభారతంలో ఒకటి ఉంటే ఈ చిత్రంలో మరొకటి చూపించారని అన్నారు.‘ఈ సినిమాతో అశ్వత్థామ, కర్ణుడు హీరోలు అయ్యారు. భీముడు, కృష్ణుడు విలన్లు అయ్యారు. భారతం చదివితే విషయం అర్థం అవుతుంది. కర్డుడినే అశ్వత్థామ కాపాడారు. ఆయన మహావీరుడు’ అని చెప్పుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version