హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రమూలాలు.. NIA సోదాలు

-

హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రమూలలు బట్టబయలు అయ్యాయి. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో NIA అధికారులు సోదాలు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఆ మధ్యకాలంలో అమీర్‌పేట, పాతబస్తీలో జాతీయ దర్యాప్తు బృందం అధికారులు సోదాలు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారంతా ఉగ్రవాద చర్యలు, ఐసీసీ‌తో చేరేందుకు ప్రయత్నించారని తెలిసింది. మరికొందరు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం కోసం సెర్చ్ చేసినట్లు కూడా తేలింది.

తాజాగా ఐసీస్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రిజ్వాన్ అలీ సైదాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గతంలో అద్దెకు ఉన్నాడని తెలిసి, NIA అధికారులు ఆదివారం సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. అతనికి అద్దెకు ఇచ్చిన యాజమానిని సైతం ప్రశ్నించింది. ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ సాయంతో రిజ్వాన్ హైదరాబాద్ వచ్చి కేరళ, యూపీలకు రాకపోకలు సాగించాడు. ఆగస్టు 15న దేశంలో భారీ ఉగ్రకుట్రకు పాల్పడేందుకు ప్లాన్ చేసి ఢిల్లీలో పోలీసులకు దొరికిపోయాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version