సినీ నటి గాయత్రి గుప్తా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. గాయత్రి అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ చిన్న దానికి సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన నటన, అందచందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతారు. ఇదిలా ఉండగా… ఈ చిన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తాను చిన్నప్పుడు పడిన కష్టాలను పంచుకున్నారు. మా నాన్నకు ఐదుగురు అమ్మాయిలం.

అతనికి అబ్బాయి కావాలని ఎంతగానో కోరిక ఉండేది. అందుకోసం మా నాన్న రెండవ వివాహం చేసుకున్న మళ్లీ అమ్మాయే పుట్టింది. అప్పటినుంచి మా నాన్న కోపంతో నన్ను చీపురు, చెప్పులు, వైర్లతో కొట్టి కారం పోసేవాడు. మేము చాలా డబ్బు ఉన్న వాళ్ళం అయినా మా నాన్న కనీసం పాకెట్ మనీ కూడా ఇవ్వలేదు. నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా అచ్చం అలాంటివాడే అందుకే నేను విడాకులు తీసుకున్నాను అంటూ గాయత్రి గుప్తా హాట్ తన విషయాలను షేర్ చేసుకున్నారు. గాయత్రి మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి.