విజయ్ దేవరకొండ తో హరీష్ శంకర్ కొత్త సినిమా..!

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను నిర్మాత నాగ వంశీ నిర్మిస్తారని సమాచారం అందుతోంది. ఈ విషయంపైన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన “కింగ్డమ్” సినిమా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

vijay
vijay

ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటారని తన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన తదుపరి సినిమాను విజయ్ దేవరకొండ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయబోతున్నట్లుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది. కాగా మరోవైపు హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news