మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ ‘గాడ్‌ఫాదర్’. మోహన్‌రాజా దర్శకుడు. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలో రేపు ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ‘గాడ్‌ఫాదర్’ ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ నయనతార గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
’’ ‘గాడ్‌ఫాదర్’ సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సింది లేడీ సూపర్ స్టార్ నయనతారకు. మోహన్‌రాజా వల్లే ఆమె ఈ సినిమా ఓకే చేసింది. ఫైనల్ డే షూట్ కోసం గత నెలలో ఆమె సెట్‌కు వచ్చారు. గంట వ్యవధిలోనే షూట్ పూర్తి చేసుకొని ఆమె వెళ్లిపోయారు. అయితే అప్పటికే మేము ఆమెకు బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆమె ఇంత కావాలని ఎప్పుడూ మమ్మల్ని అడగలేదు. ఆమె టీమ్ కూడా ఏ రోజూ డబ్బుల గురించి ప్రశ్నించలేదు. వర్క్ పట్ల ఆమె చూపించిన క్రమశిక్షణ, శ్రద్ధ నాకు బాగా నచ్చాయి. ఇటీవల ఆమెకు డబ్బులు కూడా ఇచ్చేశాం’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు.