అగ్రరాజ్యం అమెరికాలో అనుకోని సంఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం కనిపించకుండా పోయింది. దీంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అలాస్కా మీదుగా ప్రయాణిస్తుండగా విమానం అదృశ్యం కావడంతో ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కనిపించకుండాపోయిన విమానంలో ఒక పైలట్, తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమానం ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడైనా కూలిపోయిందా? అనే అనుమానాలు సైతం రేకెత్తుతున్నాయి. విమానం టేకాఫ్ అయిన ప్రాంతం చుట్టుపక్కల ఉండే కొండ ప్రదేశాలు, సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.