బాహుబ‌లి ల‌వ‌ర్స్‌కు గుడ్ న్యూస్‌… ‘ బాహుబ‌లి 3 ‘ అప్‌డేట్‌

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా ప్రమోషన్లలో చాలా బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సాహో థియేటర్ల‌లోకి వచ్చేందుకు మరో ఆరు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. సాహో ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. సాహోపై బాహుబలి రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ తో పాటు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ సైతం సాహో ఎలా ? ఉండబోతుందో అని తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తుంది.
ఇదిలా ఉంటే బాహుబలి సీరిస్ సినిమాలతో ప్రభాస్ ఎంతలా సంచలనం క్రియేట్ చేశాడో ప్రపంచం మొత్తం చూసింది. బాహుబలి సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఈ అభిమానులు అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చేసింది. త్వరలో బాహుబలి 3 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాహో సినిమా ప్రమోషన్లలో ప్రభాస్ ఈ విషయాన్ని వెల్లడించారు.

బాహుబలి రెండు భాగాల్లో దాదాపు 60% కథను మాత్రమే పూర్తి చేశామని చెప్పాడు. రాజమౌళి మదిలో బాహుబలి  సీక్వెల్‌-3 కూడా ఉందన్నాడు. అయితే అది ఎప్ప‌ట‌కి వ‌స్తుంద‌న్న‌ది మాత్రం తాను చెప్ప‌లేన‌ని చెప్పాడు. ఇక బాహుబ‌లి గురించి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు ఆ సినిమా కోసం కేటాయించినందుకు తనకు ఏ మాత్రం బాధలేదన్నాడు. నా జీవితంలో అమరేంద్రబాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నాడు.

బాహుబ‌లి సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు కొన్నిసార్లు క‌థ‌లో లీన‌మై త‌న‌కు తానే మ‌ర్చిపోయిన సంఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయ‌ని ప్రభాస్ చెప్పాడు. ఏదేమైనా బాహుబ‌లి 3 మాట ప్ర‌భాస్ నోటి నుంచే స్వ‌యంగా రావ‌డంతో అది ఎప్పుడైనా కార్య‌రూపం దాల్చ‌నుంది. ఇక ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఎన్టీఆర్ – చెర్రీతో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version