ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్ పోటీలో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై సింధు 21-7, 21-7 తేడాతో ఘన విజయం సాధించి భారత కీర్తి పతాకాన్ని మరోసారి ఎగురవేసింది.
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలంపిక్ పతక విజేత, తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్ పోటీలో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై సింధు 21-7, 21-7 తేడాతో ఘన విజయం సాధించి భారత కీర్తి పతాకాన్ని మరోసారి ఎగురవేసింది. బ్యాడ్మింటన్‌లో తనకు ఎదురు లేదని సింధు చాటి చెప్పింది. ఫైనల్ అయినా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా అలవోకగా సింధు నెగ్గడం విశేషం.
ఫైనల్ మ్యాచ్ తొలి రౌండ్‌లోనే పీవీ సింధు అదరగొట్టింది. అలాగే రెండో రౌండ్‌లోనూ మొదట్నుంచే పాయింట్లను సాధిస్తూ ఒకుహరపై సింధు ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ క్రమంలో సింధు 2 నుంచి 9 పాయింట్లు వచ్చే వరకు ప్రత్యర్థిని కోలుకోనివ్లేదు. మధ్యలో ఒకుహర రెండు పాయింట్లు పొందినా సింధు మళ్లీ తన జోరు కొనసాగించి సత్తా చాటింది. ఈ క్రమంలో విరామం వరకు సింధు 11-4 వద్ద నిలిచింది. ఆ తరువాత కూడా అదే స్పీడు కొనసాగించింది. దీంతో 21-7 తేడాతో ఒకుహరపై సింధు ఘన విజయం సాధించింది.