హరిహర వీర మల్లు అభిమానులకు శుభవార్త.. తెలంగాణలో ప్రీమియర్ షోలు పడనున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు నిర్మాత ఏఎమ్ రత్నం గుడ్‌న్యూస్ చెప్పారు.
23న రాత్రి 9, 9.30 గంటలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోల్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఈ అప్‌డేట్‌తో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇక అటు హరిహర వీరమల్లు సినిమాకు గుడ్ న్యూస్. హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 100 నుంచి రూ.150 వరకు పెంచుకుండెకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.200 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.