ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రేపు పుష్ప నుంచి బిగ్ అప్ డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. రేపు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న పుష్ప సినిమా కు సంబంధించిన బిగ్ అప్ డేట్ రానుంది. ఈ పుష్ప సినిమా కు సంబంధించిన ట్ర‌యిల‌ర్ గురించి ఐకాన్ స్టార్ అభిమాను ల తో పాటు సినీ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప -1 నుంచి ట్ర‌యిల‌ర్ ఎప్పుడు విడుదల అవుతుందో అంశం పై చిత్ర బృందం తాజా గా స్పందించింది.

అంతే కాకుండా పుష్ప -1 ట్ర‌యిల‌ర్ పై రేపు ఉద‌యం 11:07 గంట‌ల‌కు ముఖ్య‌మైన ప్ర‌క‌ట‌న కూడా చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే పుష్ఫ – ది రైజ్ ట్ర‌యిల‌ర్ విడుద‌ల తేదీ ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. కాగ పుష్ప సినిమా ను రెండు భాగాలు గా తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా వ‌చ్చే నెల 17 న ప్ర‌పంచ వ్యాప్తం గా పాన్ ఇండియా రెంజ్ లో విడుదల కానుంది. అలాగే డిసెంబ‌ర్ 12న హైద‌రాబాద్ లో ఈ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌డానికి చిత్ర బృందం సన్నాహాకాలు చేస్తుంది.