ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ వలలో పడి మోసపోతున్నారు. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ మహదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్ కి ప్రచారం చేయడం గమనార్హం. దీంతో అక్టోబర్ 06న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.
మరోవైపు వారం రోజుల కిందటే వైజాగ్ లో 10 మందిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. మహదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్ కి రణబీర్ కపూర్ ప్రచార కర్తగా పని చేశారు. మహదేవ్ యాప్ వేల కోట్ల బిజినెస్ చేస్తుంది. దీంతో యువకులు కోట్ల రూపాయలు ఆస్తులను పోగొట్టుకుంటున్నారు యువకులు. కొంతమంది ప్రాణాలను కోల్పోయినట్టు కూడా సమాచారం. ఈడీ రణబీర్ కపూర్ ఈనెల 06న ప్రశ్నించనుంది. బెట్టింగ్ యాప్ కి ప్రచారం చేయడానికి కారణమేంటి..? ప్రచారం చేయడం వల్ల ఎం లాభం ఉంది అనే కోణంలో విచారించే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 06న రణబీర్ కపూర్ హాజరు అవుతారా లేదా అనేది వేచి చడూాలి మరీ.