గుంటూరు కారం సాంగ్ లీక్.. అయ్యో తమన్ నీకే ఎందుకిలా..?

-

మహేశ్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ టీమ్​కు షాక్ తగిలింది. ఈ సినిమాలో ఓ సాంగ్​ను రిలీజ్ చేయాలని టీమ్ చాలా ఈగర్​గా వెయిట్ చేస్తోంది. ఆ పాట కోసం ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే లీక్ అవ్వడం ఇప్పుడు ఆ టీమ్​ను షాక్​లోకి నెట్టేసింది. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు సంబంధించి ఓ ఆడియో క్లిప్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

‘ఎదురొచ్చేగాలి..ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ..’ అంటూ ఈ పాటలో ఊరమాస్ పదాలు ఉన్నాయి. ఇది జస్ట్ ట్రాక్ బీట్ మాత్రమేనని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఫుల్​ క్వాలిటీ వెర్షన్ సాంగ్​ కాదని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు అయ్యో పాపం తమన్, అయ్యో దేవుడా.. తమన్​కే ఎందుకిలా జరుగుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవలే రామ్​ చరణ్​ గేమ్​ ఛేంజర్ సాంగ్​​ లీక్ అయిన విషయం తెలిసిందే. అలా జరిగిన తర్వాత తమన్​ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. గుంటూరు కారం లీక్​ను ఆపలేకపోయారు. టాలీవుడ్​ను లీకులు కుదిపేస్తున్నాయంటూ ఇటు ఇండస్ట్రీ ప్రముఖులు.. అటు ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version