అందుకే హీరోయిన్ అవకాశాలు కోల్పోయాను: అనసూయ

-

టాలీవుడ్​లో యాంకర్​గా తన కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ దూసుకెళ్తోంది అనసూయ భరద్వాజ్. ఈ బ్యూటీని ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. తనకు హీరోయిన్​గా అవకాశాలు రాకపోవడానికి గల కారణాలు చెప్పుకొచ్చింది.

షూటింగ్స్‌లో తన పని తాను చూసుకుని వెళ్తుంటానని.. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటానని చెప్పింది ఈ రంగమ్మత్త. అందువల్లే హీరోయిన్ అవకాశాలను కూడా కోల్పోయానని తెలిపింది. పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయంటే అలాంటి అవకాశాలు తనకు అవసరం లేదని.. వాటిని తాను ప్రోత్సహించనని స్పష్టం చేసింది. ఏదైనా సినిమా ఆఫర్ వస్తే అందులో తనకే ప్రాధ్యాన్యం ఉండాలనుకున్నానని.. కానీ, ఇప్పుడు తనలో మార్పు వచ్చిందని చెప్పుకొచ్చింది ఈ భామ. ఎలాంటి పాత్రలోనైనా తన నటనతో గుర్తింపు తెచ్చుకోగలనని నమ్మకం కలిగిందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version