బాక్సాఫీస్ వద్ద హనుమాన్ క్రేజ్.. సెకండ్ డే కలెక్షన్లు ఎంతంటే?

-

చిన్న సినిమాగా మొదలై.. మొదట్నుంచీ ప్రేక్షకుల్లో హైప్ను క్రియేట్ చేసిన సినిమా హనుమాన్. జనవరి 12వ తేదీ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ను సొంతం చేసుకుంది. తేజ సజ్జా యాక్టింగ్, గ్రాఫిక్స్‌, బీజీఎం, కంటెంట్, స్క్రీన్ ప్లై, ట్విస్టులు, ఎలివేషన్స్ ఇలా ప్రతి ఒక్కటి ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పిస్తోంది. సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబడుతోంది.

Hanuman Movie Box Office Collection Day 2

తొలి రోజున థియేటర్లు ఎక్కువగా లేకపోవడంతో సాధారణ వసూళ్లు సాధించిన హనుమాన్ రెండో రోజు మాత్రం జోరు చూపించింది. వసూళ్లలో ఏకంగా 55.65% పెరుగుదల కనబరిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. శనివారం(జనవరి 13) రూ. 12.53 కోట్ల వరకు వసూలు చేసిందని.. ఇందులో తెలుగు వెర్షన్ నుంచి రూ. 8.4 కోట్లు, హిందీ వెర్షన్ రూ. 4.13 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 14.05 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో రూ. 9.45 కోట్ల గ్రాస్తో మొత్తంగా వరల్డ్ వైడ్గా రూ.23.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version