HanuMan : ‘హనుమాన్‌’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్

-

యంగ్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వస్తున్న మూవీ ‘హనుమాన్‌’. తేజ సజ్జా కథానాయకుడు. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్‌ కథానాయిక. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్‌ను ప్రకటించింది చిత్ర బృందం. ఈ మూవీని పాన్‌ వరల్డ్‌ స్థాయిలో మే 12న విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ ప్రచార చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో షేర్ చేసుకుంది.

ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మరాఠీ లాంటి భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, స్పానిష్‌, కొరియన్‌, చైనీస్‌, జపనీస్‌ లాంటి విదేశీ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు ఆ ప్రచార చిత్రంలో చూపించారు. అంజనాద్రి అనే ఓ ఊహా ప్రపంచంలో సాగే కథ ఇది. హనుమంతుని శక్తులు పొందిన కథానాయకుడు.. అంజనాద్రి కోసం ఎలా పోరాడాడనేది తెరపై చూసి తెలుసుకోవాలి. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version