Hari Hara Veera Mallu: పవన్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌…ఆఖరి అధ్యాయం మొదలు!

-

 

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారుండరు. అయితే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఒక వారియర్ గా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. సగభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండటం వల్ల లేట్ అవుతూ వచ్చింది.

Hari Hara Veera Mallu big update

దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్, ఇతర అప్డేట్స్ పై కూడా ఎటువంటి సమాచారం లేకుండా పోయింది. అయితే.. ఇలాంటి తరుణంలోనే.. ‘హరి హర వీరమల్లు’ నుంచి క్రేజీ అప్డేట్‌ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి షూటింగ్‌ లో పాల్గొననున్నారట పవన్‌ కళ్యాణ్‌. ఈ మేరకు చిత్ర బృందం ప్రకటన చేసింది. ధర్మం కోసం పోరాటం లో ఆఖరి అధ్యాయం  మొదలు అంటూ ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమా 28th March 2025న రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news