హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన..

-

హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేశారు. బల్కంపేట, అమీర్ పేట్ గంగూభాయి బస్తీల్లో సీఎం పర్యటన కొనసాగింది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రౌండ్ లెవల్ లో పరిస్థితిని వివరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

CM Revanth Reddy , flood , Hyderabad

అటు వరద పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డికి వివరించాడు బాలుడు. బుద్ధ నగర్ లో జశ్వంత్ అనే బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై ఆరా తీసిన ముఖ్యమంత్రి… కాలనీలో నడుస్తూ జశ్వంత్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. తను 7వ తరగతి చదువుతున్నట్లు సీఎంకు వివరించిన జశ్వంత్… వరద నీరు ఇంట్లోకి చేరడంతో పుస్తకాలు తడిసిపోయాయని చెప్పాడు. భవిష్యత్ లో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని బాలుడికి ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news