HBD Janhvi: ఉల్లిపొర లాంటి దుస్తుల్లో పరువాలు వడ్డిస్తున్న జాన్వీ..!

-

శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేస్తూనే మరొక పక్క సోషల్ మీడియా ద్వారా తన గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ కి ఇది మొదటి సౌత్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు ఆమె తల్లి కల కూడా నెరవేరబోతోంది. అయితే ఈ సినిమా కోసం అటు జాన్వి కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.. అయితే ఇంతలా ఆమె ఒక సౌత్ మూవీ కోసం ఎదురు చూడడానికి కారణం.. ఇది తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం గమనార్హం.. అందులోను గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎన్టీఆర్ తో నటించడం అంటే మామూలు విషయం కాదు..

మరోవైపు డైనమిక్ దర్శకుడు కొరటాల శివతో పనిచేయడం ఇలా అన్నీ కూడా ఆసక్తిని కలిగించే అంశాలే.. దీనితో ఈ సినిమా కోసం ఈమె చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అతి త్వరలోనే లాంచ్ కానుంది.. అలాగే మార్చి 20వ తేదీ నుంచి చిత్రీకరణ ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈమె ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక ఫోటో షూట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఆమె బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె లుక్ ను విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది.

ఈ క్రమంలోనే మార్చి ఆరవ తేదీన అంటే ఈరోజు జాన్వి తన పుట్టినరోజును జరుపుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించడమే కాదు ఆమె లుక్ ని కూడా టీం విడుదల చేయబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె షేర్ చేసిన ఉల్లిపొర లాంటి చీరలో తన అందాలను ప్రదర్శిస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. పింక్ కలర్ ఉల్లి పొరలాంటి శారీలో తన లో అందాలను కూడా చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే ఈ ఫోటోలు యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version