సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘He is So Cute’ సాంగ్….!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా పై టాలీవుడ్ ప్రేక్షకులు మరియు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో మంచి అవకాశాలున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన రాబట్టడంతో పాటు సినిమాపై బాగానే అంచనాలు పెంచడం జరిగింది.

ఇక నేడు ఈ సినిమా నుండి హీరోయిన్ సాంగ్ అయిన ‘హి ఈజ్ సో క్యూట్’ అనే పల్లవితో సాగె సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. హీరో గురించి హీరోయిన్ ఎంతో అందంగా పొగుడుతూ అతని పై ప్రేమను వ్యక్తపరుస్తూ సాగె ఈ సాంగ్ కు యువత మరియు అమ్మాయిలు బాగా ఆకర్షితులవుతున్నారు. దేవిశ్రీప్రసాద్ అందించిన పెపీ ట్యూన్ కి యువ లేడీ సింగర్ మధుప్రియ గాత్రం మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. ఇక లిరిసిస్ట్ శ్రీమణి అద్భుతమైన లిరిక్స్ ని ఈ సాంగ్ కి అందించాడు.

ఈ సాంగ్ రేపు రిలీజ్ తరువాత థియేటర్ లో అదరగొట్టి తీరుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, ప్రకాష్ రాజ్, సంగీత, హరితేజ, శ్రీనివాస రెడ్డి, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయనున్నారు. మరి తొలిసారి మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version