తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను హంతకుడిలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. తాజాగా ఆయన ఓ వీడియోలో విడదల చేశారు. తెలంగాణలో ప్రతిరోజూ దాదాపుగా 22 మంది చనిపోతున్నారు.. దీనిపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ పెట్టాల్సింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన అల్లు అర్జున్‌ను మెచ్చుకోవాల్సింది పోయి.. అతనిపై తప్పుడు కేసులు పెట్టించి చిత్రహింసలు పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించినట్టు తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిపారు. సీఎం తో పాటు మంత్రులు, పోలీస్ అధికారులు ఇలా అందరూ అల్లు అర్జున్ డైరెక్ట్ మర్డర్ చేసినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమిని చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ.