రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

-

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం పై చెన్నైలోని అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన గుండె రక్తనాళాల్లో అడ్డంకులు గుర్తించామని.. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. ఇక రజిని ఆరోగ్యంపై ఆయన భార్య లతా స్పందించారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఆయన క్షేమంగానే ఉన్నారని తెలియడంతో ఆయన అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.

తలైవా త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్ధిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ వేట్టయాన్, కూలి సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన వేట్టయాన్ సినిమా ఆడియో రిలీజ్ లోను రజినీకాంత్ పాల్గొని అనిరుద్ తో కలిసి డాన్స్ చేశారు. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version