ఆమె జీవితం అందరికీ ఓ గుణపాఠం – గుమ్మడి..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సావిత్రి లాంటి మహానటి మళ్లీ పుట్టాలి అంటే ఒక శతాబ్దం పడుతుంది అని.. ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒక సందర్భంలో వెల్లడించారు. ఇకపోతే సావిత్రి తనను అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే వారని గుర్తు చేసుకున్న గుమ్మడి సావిత్రి జీవితం సినీ నటులకే కాదు అందరికీ ఒక గుణపాఠం అని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సావిత్రి , సూర్యకాంతం తనను అన్నయ్య అని పిలిచేవారు అని, సావిత్రి జీవితంలో పడిన కష్టాలని ప్రత్యక్షంగా తాను చూసానని కూడా గుమ్మడి తెలిపారు.

ఇకపోతే సావిత్రి చివరి రోజులలో గుమ్మడికి అనారోగ్యం చేసిందని.. అప్పుడు తనను చూడడానికి సావిత్రి వెళ్లారట. అయితే అప్పుడు గుమ్మడి మత్తులో ఉన్నారట. సావిత్రి ఎంతో ప్రేమగా ఎలా ఉన్నావ్ అన్నయ్య అని అడిగారు. ఇక బాగున్నాను అన్నట్లు తల ఊపితే.. సావిత్రి .. గుమ్మడి తలగడ సర్ది వెళ్లినట్టు అనిపించిందని ఆయన తెలిపారు. ఇక దాని కింద చూస్తే తలగడి కింద రూ.2000 పెట్టి సావిత్రి వెళ్లినట్లు.. ఆ తర్వాత గుమ్మడి సావిత్రి కి ఫోన్ చేసి ఏంటమ్మా ఇక్కడ డబ్బు పెట్టి వెళ్ళావని అడగగా.. ఓసారి నేను మీ దగ్గర తీసుకున్నాను అన్నయ్య మర్చిపోయారా? నేను ఎవరికీ కూడా అప్పు పడి ఉండకూడదు.. నిన్ననే వడ్డీ వాళ్ళు వచ్చి నాకు రూ .5000 ఇచ్చారు. అందులో రూ.2000 తీసుకువచ్చాను అంటూ సావిత్రి చెప్పిందట. దీంతో ఆయన కళ్ళు చమర్చారు.

ఇకపోతే సావిత్రి వైభవం తగ్గినప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయని ,దీంతో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయని ఆయన వెల్లడించారు. ఆమె ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అన్నీ దానం చేసింది. ఇక చివరిలో ఉన్న ఆస్తులను కూడా కోల్పోయి దీనస్థితిలో బతికింది. ఇక ఆమె లాంటి నటి పుట్టాలి అంటే మరో శతాబ్ద కాలం పడుతుంది అంటూ గుమ్మడి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news