హీరో నాని మరో బ్లాక్ బస్టర్ హిట్ దిశగా అడుగులు,!

-

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటిస్తున్న దసరా సినిమా  మార్చి నెలలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా తో కచ్చితంగా హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు. ఇక హిట్ కోసం నాని మొత్తం  మమ మాస్ లాగా  తయారు అయ్యాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో లాగా నాని గడ్డం తో చింపిరి జుట్టు పాత లుంగీ నలిగిన చొక్కాతోచాలా మాస్ గా  హడావుడి చేస్తున్నాడు.

సినిమాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా దసరా సినిమా టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్ ఈవెంట్ సందర్బంగా నాని  తన సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పై  పొగడ్తల వర్షం కురిపించాడు. చూస్తూంటే దసరా సినిమా పై నాని కి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అలాగే తన సినిమా డైరెక్టర్ పై విపరీత నమ్మకంతో  శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరును గుర్తు పెట్టుకోండి అని కూడా నాని ట్వీట్ చేశాడు.

ఇక నాని సంగతి వదిలేస్తే తెలుగు సినిమా పరిశ్రమ లో మిగిలిన వారు కూడా ఈ డైరెక్టర్ ను పొగుడుతున్నారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా టీజర్ లో లాస్ట్ షాట్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని కామెంట్ చేశారు. దీనితో డైరెక్టర్ థాంక్స్ చెబుతూ ఆనందం తో కోతి లాగా గెంతు తున్నాను అంటూ రిప్లై ఇచ్చారు. ఇక దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంత్ ఓదెల స్వీట్ అండ్ జెన్యూన్ మెసేజ్ అని అన్నారు. ఒక లెజెండ్ పర్సన్ కాంప్లిమెంట్స్ తర్వాత అందరివీ కాస్త తగ్గుతాయి అని తెలుసు. కానీ మీ నిజాయితీ కి హ్యాట్సాఫ్, అమ్మతోడు గత్తర్ లేపినవ్ పో అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఇదంతా చూస్తూంటే హీరో నాని తన ఖాతా లో మరో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకునేలా ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version