ఇది ఎన్నికల సీజన్.. అంటూ పొలిటికల్ లీడర్​గా మారిన నాని

-

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని పొలిటికల్ లీడర్​గా మారిపోయారు. తెలంగాణలో ఎన్నికల ఫీవర్ నడుస్తున్న వేళ నాని తన సోషల్ మీడియాలో తాజాగా చేసిన పోస్టు ఆసక్తి కలిగిస్తోంది. అయితే ఈ పోస్టు చూసి మొదట నాని ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతున్నాడా అని ఆశ్చర్యపోయారు. అయితే పోస్టు కింద క్యాప్షన్ చూసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ నాని పెట్టిన పోస్టు ఏంటంటే..?

హీరో నాని లేటెస్ట్​గా నటించిన సినిమా హాయ్ నాన్న. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్​గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. అయితే తాజాగా తెలంగాణలో ఎన్నికల జోష్ కనిపిస్తున్న వేళ నాని తన సినిమా ప్రమోషన్స్​కు.. ఎలక్షన్ ప్రచారానికి లింకు పెడుతూ ఇంట్రెస్టింగ్ పోస్టు చేశారు.

‘‘ఇది ఎన్నికల సీజన్‌. ఇందులో మనం ఎందుకు జాయిన్ కాకూడదు.. డిసెంబర్‌ 7న మీ ప్రేమను మాకు ఇవ్వాలి. మీ ఓటు మాకే వేయాలి. ఇట్లు.. మీ ‘హాయ్‌ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్‌ విరాజ్‌’’ అని పోస్టులో రాసుకొచ్చారు. ఇంకా ఇలాంటి సరదా ప్రచారాలు చాలా చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. నాని గెటప్​కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version