నీ రాక‌తో నా జీవితం.. భార్యపై నిఖిల్ ఎమోషనల్ పోస్ట్..!

-

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ లాక్‌డౌన్ స‌మ‌యంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం త‌న భార్య‌తో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో భార్య ప‌ల్ల‌వి వ‌ర్మ బ‌ర్త్‌డే సందర్బంగా ఆమెతో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్ కామెంట్ పెట్టాడు. ‘నా ప్రియ‌మైన భార్య‌కు హ్యాపీ బ‌ర్త్ డే. నువ్వు నా జీవితంలో ఎప్పుడైతే వ‌చ్చావో అప్ప‌టి నుండి నా లైఫ్ అంతా ఆనంద‌మ‌యంగా మారింది’ అంటూ ట్వీట్ నిఖిల్ చేశాడు.

కాగా, మే 14వ తేదీన తన బంధు మిత్రుల సమక్షంలో ఉదయం 06 గంటల 31 నిమిషాలకు అగ్ని సాక్షిగా తన ప్రేయసి పల్లవి వర్మను నిఖిల్ వివాహం చేసుకున్నాడు. అలాగే చివరగా ‘అర్జున్ సురవరం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం కార్తికేయ 2తో పాటు 18 పేజెస్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version