నా పొట్టి దుస్తుల గురించి మీకు ఎందుకు…?

-

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తక్కువ కాలం లోనే మంచి ఫేం సంపాదించుకుంది. తక్కువ సమయంలో ఆమెకు మంచి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఆమె వేసుకునే దుస్తులే. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాష్ కి ఎందరో అభిమానులు ఉన్నారు. పొట్టి దుస్తులు వేసుకుని హాట్ హాట్ గా కనపడుతూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్.

దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. ఆమె రెచ్చగొట్టే విధంగా జిమ్ కి బట్టలు వేసుకుని వెళ్తుందని ఇలాంటి వాళ్ళ వలనే అత్యాచారాలు జరుగుతున్నాయని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ లు చేసి విమర్శలు చేస్తూ ఉంటారు. దీనిపై జాన్వి స్పందించారు. అభిమానులు ఇంతకుముందు నా దగ్గరకు వచ్చి నా తొలి సినిమా `ధడక్` గురించి మాట్లాడేవారని..

ఆ సినిమా బాగుందని, అందులో నా నటన చాలా బాగుందని చెప్పేవారని… ఇప్పుడేమో నేను జిమ్‌కి వేసుకునే దుస్తులు చాలా బాగుంటున్నాయ్ అంటున్నారన్నారు. వారు అలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగని వారినేం తప్పు పట్టను. ఎందుకంటే అందరూ అందం, దుస్తుల మీదే దృష్టి పెడతారు. మున్ముందు నేను వేసుకునే పొట్టి దుస్తుల గురించి కాకుండా, నా సినిమాల గురించి మాట్లాడుకుంటారని అనుకుంటున్నా అంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version